కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కొలవెన్నులో మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో జరిగే జన్మభూమి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్ళిన వైఎస్ఆర్ సీపీ నేత, మాజీమంత్రి కె.పార్ధసారధిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనకూడదంటూ పోలీసుల ఆంక్షలు విధించారు. గ్రామ సర్పంచ్ ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరికలు చేశారు. జన్మభూమిలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని పార్థసారథి విజ్ఞప్తి చేసినా పోలీసులు స్పందించకపోవడంతో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి గృహ నిర్బంధం
Jan 9 2018 9:30 AM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement