వైఎస్సార్ జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారని మాజీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అనే నినాదంతో సోమవారం రాజంపేట కేంద్రంగా వైఎస్సార్‌సీపీ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ హయాంలో ఉన్న అనుకూలత ఇప్పుడు ఎందుకు లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఐదేళ్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నాలుగేళ్ల తర్వాత టీడీపీ నేతలకు ఉక్కు పరిశ్రమ గుర్తొచ్చిందా అని నిలదీశారు. మోదీకి వంగి వంగి దండాలు పెట్టే టీడీపీ నేతలు దీక్షలు చేసేవారా అంటూ ఎద్దేవా చేశారు.