ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దళితులు అణచివేతకు గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగర్జున విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో దళితులు అభివృద్ధికి, సంక్షేమానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని గుర్తుచేశారు. కానీ నేడు టీడీపీ నేతలు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దోచుకుంటున్నారని ఆరోపించారు.