కట్టుకున్న భర్త చనిపోవడంతో ఆమెకు అండ లేకుండా పోయింది. అత్తింటి వాళ్లు ఆమెను నానా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. దాదాపు ఇంట్లో నుంచి గెంటేసినంత పనిచేశారు. ఫలితంగా ఎన్నోసార్లు తన సమస్యను పరిష్కరించాలంటూ పోలీసుల చుట్టూ తిరిగింది. వారు స్పందించకపోవడంతో ఇతర అధికారుల వద్దకు వెళ్లింది. ఆఖరికి ముఖ్యమంత్రి కలవడమే కాకుండా రాష్ట్రపతి లేఖ కూడా పెట్టింది. అయినా ఫలితం లేకపోవడంతో వేరే దారి లేక ఆ మహిళ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. ఏకంగా సెల్‌ఫోన్ టవర్ ఎక్కింది. తన సమస్యను పరిష్కరించకుంటే ప్రాణాలు విడిచేందుకు సైతం వెనుకాడబోనని హెచ్చరించింది. దీంతో పోలీసులు దిగొచ్చారు.
అత్తవారితో డేంజర్.. సెల్ టవరెక్కిన మహిళ
Feb 3 2018 9:49 AM | Updated on Mar 20 2024 3:12 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement