గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన స్పైస్ జెట్ విమానం దిగేందుకు విజుబుల్ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. హైదరాబాద్ నుంచి గన్నవరం రావాల్సిన ట్రూజెట్, ఇండిగో విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం చుట్టపక్క గ్రామాలను పొగమంచు ఆవరించింది. ఉదయం 7 గంటల అయినా పొగమంచు వీడలేదు. రహదారులపై మంచుపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి