సోషల్ మీడియాలో నయా ట్రెండ్‌గా మారిన చాలెంజెస్ తరహాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో కొత్త చాలెంజ్‌కు స్వీకారం చుట్టాడు. ఇప్పటికే ఫిట్ ఇండియా, కికీ, ఐస్ బకెట్ చాలెంజ్‌లు ప్రాచూర్యం పొందాయి. ఫిట్‌ఇండియాతో ఆరోగ్యంపై తీసుకోవాల్సిన శ్రద్ద గురించి విస్త్రుత ప్రచారం చేశారు. ఈ చాలెంజ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్యుడి వరకు పాల్గొన్నారు. ఈ తరహాలోనే భారత సంప్రదాయలపై విస్తృత ప్రచారం కల్పించాలని కోహ్లి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా #Veshbhusha చాలెంజ్‌ను తీసుకొచ్చాడు.