బలవంతమైన సర్పము.. చలి చీమల చేత చిక్కి ..అనే సుమతీ పద్యం గుర్తుందా. చీమల బలం, నైపుణ్యం గురించి ఇంతకన్నా ఉదాహరణ బహుశా ఉండదేమో. క్రమశిక్షణలోగానీ, ఆహారాన్ని దాచుకునే విషయంలోగానీ చీమలను చూసి నేర్చుకోవాలంటారు పెద్దలు. ఎందుకంటే శరీర బరువు కంటే దాదాపు 10 రెట్లు బరువున్న వస్తువులను కూడా అవి అలవోకగా మోయ్యగలవట. ఇలా పుట్టల్లోకి లాక్కుపోతూ ఉండే దృశ్యాలను బాల్యంలో చాలామందిమి చూసే వుంటాం, కదా.. అయితే తాజాగా ఇలాంటి చీమ ఒకటి ఆభరణాల షాపులోకి దూరింది.