విషాద ప్రయాణం..ముగ్గురు మృతి,40మందికి గాయాలు | Three pilgrims killed, 40 injured in road accident | Sakshi
Sakshi News home page

విషాద ప్రయాణం..ముగ్గురు మృతి,40మందికి గాయాలు

Jun 14 2018 9:42 AM | Updated on Mar 22 2024 11:30 AM

కాశీ యాత్ర ముగించుకుని వస్తున్న ఓ ట్రావెల్స్‌ బస్సును లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నుంచి ఈ నెల 2న 45 మంది ట్రావెల్స్‌ బస్సులో కాశీ యాత్రకు బయల్దేరారు. వారంతా యలమంచిలి, ఎస్‌.రాయవరం, జి.కోడూరు, మాకవరం, రాంబిల్లి, పోతిరెడ్డిపాలెం గ్రామాలకు చెందినవారు. యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో వారంతా బుధవారం తెల్లవారుజామున పూసపాటిరేగ మండలం చింతపల్లి వద్ద సముద్ర స్నానాలు చేసి, గోవిందపురం వద్ద ఆలయాలు దర్శించుకుని భోజనం ముగించుకుని బయల్దేరారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement