వచ్చే నెలలో పదకొండో వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆర్థిక శాఖ పీఆర్‌సీకి సంబంధించిన ఫైలును ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పంపించింది. ముఖ్యమంత్రి త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పీఆర్‌సీపై చర్చించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పదో పీఆర్‌సీనే అమల్లో ఉంది. వీకే అగర్వాల్ చైర్మన్‌గా ఉన్న పదో పీఆర్‌సీ చేసిన సిఫార్సులనే కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో కొత్తగా ఇప్పుడు ఏర్పాటు చేసే కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో తొలి వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) కానుంది. జనవరిలో కమిషన్‌ను ఏర్పాటు చేసి జూలై నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపును అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు కసరత్తు ప్రారంభించింది.
2018 జూలై నుంచి కొత్త పీఆర్‌సీకి యోచన
Dec 21 2017 10:24 AM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement