బిహార్ రాష్ట్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ సైకిల్ తొక్కుతూ పట్టుకోల్పోయి కింద పడిపోయారు. ఈ ఘటన గురువారం పాట్నాలో చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ ఆయన సైకిల్ యాత్రను చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలసి యాత్రను ప్రారంభించిన ఆయన ఒక్కసారిగా స్పీడ్ పెంచారు.