వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో నీచ వ్యాఖ్యలు చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా తన వ్యూహాన్ని మార్చినట్టు కనిపిస్తోంది. వైఎస్ జగన్‌పై విజయమ్మ, షర్మిలే దాడి చేయించారంటూ రాజేంద్రప్రసాద్ చేసిన అత్యంత దిగజారుడు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు.