గంటా అలకపాన్పు ..రంగంలోకి టీడీపీ | Suspense continues on Ganta's next move | Sakshi
Sakshi News home page

గంటా అలకపాన్పు ..రంగంలోకి టీడీపీ

Jun 21 2018 10:03 AM | Updated on Mar 21 2024 7:52 PM

గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావును బుజ్జగించేందుకు టీడీపీ అధినాయకత్వం రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో విభేదాలు, పార్టీ నాయకత్వం తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో గంటా శ్రీనివాసరావు అలకపాన్పు ఎక్కిన సంగతి తెలిసిందే. ఆయన గతకొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా మంగళవారం సాయంత్రం జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశానికి సైతం దూరంగా ఉండి.. తన అసంతృప్తిని వెల్లడించారు. క్రమంగా చంద్రబాబుకు, టీడీపీకి గంటా శ్రీనివాసరావు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం.. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను రంగంలోకి దింపింది.

Advertisement
 
Advertisement
Advertisement