ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని తామంతా నిర్ణయించుకున్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తీర్మానం చేశామని ఆయన అన్నారు. సోమవారం వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర ప్రధాన కార్యాలయంలో మీడియాతో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు.