ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో రెడ్‌అలర్ట్ ప్రకటించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కేరళకు హెచ్చరికలు జారీ చేసింది. టీమిండియా హెడ్ కోచ్, సహాయక బృందానికి భారత క్రికెట్ నియంత్ర మండలి(బీసీసీఐ) దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సారి కొత్తగా వయసు, అనుభవం నిబంధనలు తీసుకొచ్చింది. బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం నాలుగున్నర నెలల పాటు తన గగనతలంపై విధించిన నియంత్రణలను పాకిస్తాన్ మంగళవారం ఎత్తివేసింది. పౌర విమాన సేవలకు గగనతలాన్ని అనుమతిస్తున్నట్టు ప్రకటన జారీచేయడంతో భారత్, పాకిస్తాన్‌ల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.
ఈనాటి ముఖ్యాంశాలు
Jul 16 2019 8:08 PM | Updated on Jul 16 2019 8:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement