క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కి ప్రభుత్వం భద్రత తగ్గించింది. శివసేన ఎమ్మెల్యే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్యకు భద్రత పెంచారు. ఆయనను జడ్ కేటగిరీకి పెంచి నట్లు బుధవారం ఒక అధికారి చెప్పారు. ఆయా వ్యక్తులకు పొంచివున్న ప్రమాదాలపై మహారాష్ట్ర ప్రభుత్వ కమిటీ సమీక్ష చేపట్టిన అనంతరం భద్రతా పరిధిలో మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. సచిన్, ఆదిత్యతో పాటు మరో 90 మందికి పైగా ప్రముఖుల భద్రతను ఇటీవల జరిగిన సమావేశంలో కమిటీ సమీక్షించినట్లు తెలిపారు.