breaking news
security downgrade
-
సచిన్‌కు భద్రత కుదింపు
-
సచిన్ భద్రత కుదింపు.. ఆదిత్యకు పెంపు
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కి ప్రభుత్వం భద్రత తగ్గించింది. శివసేన ఎమ్మెల్యే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్యకు భద్రత పెంచారు. ఆయనను జడ్ కేటగిరీకి పెంచి నట్లు బుధవారం ఒక అధికారి చెప్పారు. ఆయా వ్యక్తులకు పొంచివున్న ప్రమాదాలపై మహారాష్ట్ర ప్రభుత్వ కమిటీ సమీక్ష చేపట్టిన అనంతరం భద్రతా పరిధిలో మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. సచిన్, ఆదిత్యతో పాటు మరో 90 మందికి పైగా ప్రముఖుల భద్రతను ఇటీవల జరిగిన సమావేశంలో కమిటీ సమీక్షించినట్లు తెలిపారు. సచిన్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత ఉండేది. ఎక్స్ కేటగిరీ కింద, ఒక పోలీసు సచిన్‌కు 24 గంటలూ రక్షణ కల్పించేవారు. ఇకపై ఆయన తన ఇంటి నుండి బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా పోలీసు ఎస్కార్ట్ మాత్రం ఇస్తారని తెలిపారు. ఆదిత్య ఠాక్రేకు జెడ్ సెక్యూరిటీ భద్రత కల్పించారు. ఇప్పుడు మరింత ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణగా ఉంటారు. అంతకు ముందు ఆదిత్యకు వై ప్లస్ భద్రత ఉండేది. సామాజిక కార్యకర్త అన్నా హజారే భద్రతను వై ప్లస్ కేటగిరీ నుంచి జడ్ కేటగిరీకి పెంచినట్లు వెల్లడించారు. బీజేపీ మొదటిదఫా ప్రభుత్వంలోని మంత్రులకు భద్రతా స్థాయిలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని అధికారి చెప్పారు. -
భద్రతా సంక్షోభంలో కాంగ్రెస్ నేతలు!
న్యూఢిల్లీ : అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ .... గత ప్రభుత్వ మంత్రుల భద్రతను తగ్గించడంతో వారు ఆందోళనకు గురువుతున్నారు. మరో విశేషమేమంటే.. గత ప్రభుత్వం నియమించిన పోలీసు అధికారులను భద్రత నుంచి తొలగించి ప్రస్తుత ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. కేంద్రంలో అధికారం మారితే ...గత ప్రభుత్వ నేతలు, మంత్రులు తదితరుల రక్షణకు కొత్త సర్కార్ మంగళం పాడటం ఆనవాయితీగా వస్తున్నదే. తాజాగా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మాజీ మంత్రి మనీష్ తివారి, బొగ్గుశాఖ మాజీ మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్ లకు ఇప్పటివరకు కల్పిస్తోన్న 'జడ్' కేటగిరి భద్రతను తొలగించారు. అంతేకాకుండా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌తో పాటు మాజీ మంత్రి బేని ప్రసాద్ వర్మలకు కల్పిస్తోన్న 'జడ్' కేటగిరి భద్రతను 'వై' కేటగిరికి మార్చడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కాగా భద్రతా సంక్షోభంలో ఉన్న అందరూ కాంగ్రెస్ పార్టీ నేతలు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీరితో పాటు రీటా బహుంగ జోషి, జితిన్ ప్రసాదా, పీఎల్ పునియా, ఆర్ పీఎన్ సింగ్, సలీం షెన్వారీ తదితరులు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఇబ్బందులకు గురవుతున్నారు. బీఎస్పీ నేతలు బ్రజేష్ పాథక్, ధనంజయ్ సింగ్, సమాజ్ పార్టీ నేత అమర్ సింగ్‌లకు కూడా 'జడ్' కేటగిరి భద్రతను తొలగించిన కేంద్ర ప్రభుత్వం కేవలం 'వై' కేటగిరి అందిస్తుంది. ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్లు నీరజ్ కుమార్, వైఎస్ దడ్వాల్లతో పాటు ఆర్మీ మాజీ చీఫ్ ఎన్ సీ విజయ్‌కి ప్రస్తుతం ఎలాంటి సెక్యురిటీ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం సమాచారం ప్రకారం... 327 మంది వీఐపీల భద్రత అంశంపై సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 20 మంది వీఐపీలు తమ భద్రత కేటగిరిని తగ్గించడంపై ఆందోళన చెందుతున్నారు. ముజఫర్ నగర్లో మత ఘర్షణలతో సంబంధం ఉన్న బీజేపీ నేత సురేష్ రానాకు మాత్రం 'వై' కేటగిరి నుంచి జడ్ కేటగిరికి ప్రమోషన్ ఇస్తూ భద్రతను పెంచడం విశేషం. ఆయనతో పాటు బాబా రాందేవ్, యోగి ఆదిత్యనాథ్ లకు జడ్ స్థాయి భద్రతను కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం వారి రక్షణను పటిష్ట చర్యలు తీసుకుంది.