కేంద్రం పరిష్కరించాలి.. | Rs 47 crore to RTC : High Court asks Telangana | Sakshi
Sakshi News home page

కేంద్రం పరిష్కరించాలి..

Oct 30 2019 7:53 AM | Updated on Mar 21 2024 11:38 AM

 ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాము ఆర్టీసీకి ఎలాంటి బకాయి లేమని, బకాయిల కన్నా అదనంగా రూ.622 కోట్లు గత ఆరేళ్లలో చెల్లించామని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఆర్టీసీ కార్పొరేషన్‌కు బకా యిలు చెల్లించేశామని, 2014–15 సంవ త్సరం నుంచి ఇప్పటివరకు రూ.4,253.36 కోట్లు చెల్లించామని, ఇది బకాయిల కంటే అధికమని పేర్కొంది. జీహెచ్‌ఎంసీ కూడా రూ.1,492 కోట్ల బకాయిల్లో రూ.335 కోట్లు చెల్లించేసిందని, ప్రభుత్వం అద నంగా చెల్లించిన నేపథ్యంలో ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ కూడా చెల్లిం చాల్సినదేమీ లేదని వెల్ల డించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement