సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ములుగు జిల్లా ములుగు మండలం మహమ్మద్ గౌస్ పల్లి సమీపంలో కారు-అంబులెన్స్ ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ముందున్న మరో కారును ఢీకొట్టి ఎదురుగా వస్తున్న అంబులెన్స్ను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఎనిమిది నెలల పసికందు ఉంది. సీటు మధ్యలో ఇర్కుపోయి చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కంటతడి పెట్టించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదం.. పాపం చిన్నారి..
Oct 4 2019 3:34 PM | Updated on Oct 4 2019 3:39 PM
Advertisement
Advertisement
Advertisement
