‘నుదటి మీద తోకతో కుక్కపిల్లా.. అచ్చం ఏనుగు తొండంలా’

జంతువులు ఏదో ఒక లోపంతో జన్మిస్తుంటాయి. అది సాధారణ విషయమే అయినప్పటికీ ఈ కుక్కపిల్ల మాత్రం దానికున్న లోపంతోనే ప్రపంచమంతా ఫేమస్‌ అయ్యింది. నుదుటి మీద తోకతో జన్మించిన పది వారాల వయస్సున్న ఈ కుక్కపిల్ల ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. శనివారం ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఈ కుక్కపిల్లను చూసి పెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. వివరాలు.. అమెరికాలోని మిస్సోరి నగర వీధుల్లో పుట్టిన కుక్క పేరు ‘నార్వాల్‌ ది లిటిల్‌ మ్యాజికల్‌ ఫ్యూరీ యునికార్న్‌’  అని డాగ్‌ రెస్య్కూ సంస్థ అయిన ‘మాక్స్‌ మిషన్‌’ వారు తెలిపారు. ఆ సంస్థకు చెందిన సిబ్బందికి ఈ కుక్కపిల్ల (నార్వాల్‌) శనివారం మిస్సోరి వీధుల్లో దొరికినట్లుగా సమాచారం. ​కాగా రెండు కనుబొమ్మల మధ్య మొలచిన ఈ తోక.. చిన్నగా ఉండి ఏనుగు తొండాన్ని తలపించేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Taboola - Feed

Back to Top