చినబాబు కనుసన్నల్లో రాష్ట్రంలో విపక్షం ఓట్ల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలుపుపై ఆశలు లేని ఈ మంత్రి ఓట్ల తొలగింపుపైనే ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను బూత్‌లవారీగా తొలగించడమే లక్ష్యంగా ఆ మంత్రి తెరవెనుక చర్యలకు దిగారు.