విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో ఉద్రిక్తత | Protest in Lenin Center at Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో ఉద్రిక్తత

Oct 16 2018 11:41 AM | Updated on Mar 21 2024 6:45 PM

విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల సమ్మెను పరిష్కరించాలంటూ సీఎం క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించటానికి మున్సిపల్‌ కార్మికులు ప్రయత్నించారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ ఆందోళనలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌, వామపక్ష పార్టీల ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పలువురిని అరెస్ట్‌ చేసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement