విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. స్నేహితుడు పవన్ సహాయంతో తన తలపై గాయపరుచుకుని సినీ ఫక్కీలో డ్రామా రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. రీ పోస్టుమార్టంలో జ్యోతిపై లైంగిక దాడి గానీ, లైంగిక దాడి యత్నం గానీ జరగలేదని, ఆమెను బలమైన రాడ్డులాంటి ఆయుధంతో కొట్టి చంపారని తేలడంతో శ్రీనివాసరావు కుట్ర బయటపడింది. హత్యకు పాల్పడిన విధానాన్ని పవన్ పోలీసులకు చెప్పిన వీడియోను చూపించినప్పటికీ శ్రీనివాసరావు మాత్రం తాను హత్య చేసినట్లు అంగీకరించలేదు. దీంతో పోలీసులు బుధవారం అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి అరెస్టు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. నేరం అంగీకరించమని తమ కుమారుడిని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని శ్రీనివాస్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.