ఎంపీ రాయపాటి సాంబశివరావుకు టీడీపీ నాయకులే టిక్కెట్ రాకుండా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాయపాటికి బదులుగా మరో అభ్యర్థిని అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే లగడపాటి రాజగోపాల్ పేరును తెరపైకి తెచ్చినట్లు టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఈ పరిణామం రాయపాటి సోదరులను కలవరపరుస్తోంది. అవసరం లేదనుకుంటే ఎంతకైనా చంద్రబాబు తెగిస్తారనే వాస్తవం రాయపాటి విషయంలో మరోసారి రుజువైందని తెలుగుదేశం పార్టీ నేతలే అంటున్నారు.