అధ్యాపకులే అపర కీచకుల్లా వ్యవహరించారు. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన వైద్య విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురిచేశారు. వివాహిత కూడా అయిన ఆమె వీరి వేధింపులు భరించలేక గతంలో పలుమార్లు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన పట్టించుకోలేదు. వేధింపులు కొనసాగడంతో గత ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు, మంత్రి లోకేశ్‌కు సదరు విద్యార్థిని ఫిర్యాదు చేసింది. దీంతో కక్షగట్టిన ప్రొఫెసర్లు పరీక్షల్లో ఫెయిల్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంది.
వేధింపులే చంపేశాయి
Aug 10 2018 9:48 AM | Updated on Mar 20 2024 3:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement