సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ముసుగు తొలిగిపోయిందని, ఆయన చంద్రబాబు నాయుడు మనిషేనని స్పష్టమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి తెలిపారు. మంగళవారం ఆమె పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ మనిషేనని తమ పార్టీ ఎప్పటి నుంచో చెబుతుందని, ఆయన టీడీపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ అనుకూల మీడియాలో రావడంతో ఈ విషయం సుస్పష్టమైందన్నారు.