మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్ర మాజీమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు న్యాయస్థానంలో చుక్కెదురు అయింది. ఆయనను అయిదు రోజులపాటు సీబీఐ కస్టడీకి ఢిల్లీ పటియాలా కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా కార్తీ చిదంబరాన్ని 14 రోజుల కస్టడీకి అనుమతించాలని సీబీఐ అధికారులు కోరినప్పటికీ ...న్యాయస్థానం మాత్రం మార్చి 6వ తేదీ వరకూ కస్టడీకి అనుమతించింది. ఐఎన్‌ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు తన తండ్రి ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన సమయంలో అనుమతులు ఇప్పించారనే ఆరోపణలను కార్తీ చిదంబరం ఎదుర్కొంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగా కార్తీ చిదంబరంకు భారీగా ముడుపులు ముట్టాయని సీబీఐ ఆరోపిస్తోంది. రిమాండ్ సమయంలో రోజుకు రెండు గంటలు న్యాయవాదిని కలుసుకునేందుకు కోర్టు అనుమతించింది. ప్రిస్క్రిప్షన్‌లోని మెడిసిన్స్ తీసుకోవచ్చని..అయితే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతించబోమని తెలిపింది.
కార్తీ చిదంబరానికి ఎదురుదెబ్బ
Mar 1 2018 7:57 PM | Updated on Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
Advertisement
