జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 23 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 52 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొండగట్టు ఘాట్‌ రోడ్డులో బస్సు కిందకు దిగుతున్న సమయంలో బ్రేక్‌ ఫెయిల్‌ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటుందనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో బంధువుల ఆర్తనాదాలతో విషాద వాతావరణం నెలకొంది. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top