గోదావరికి పెరుగుతున్న నీటి ప్రవాహం | Huge Flood water Inflow In Projects | Sakshi
Sakshi News home page

గోదావరికి పెరుగుతున్న నీటి ప్రవాహం

Aug 17 2018 12:35 PM | Updated on Mar 21 2024 7:54 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీనితో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కూనవరం ప్రాంతంలో శబరి నది ఎగపోటు ఆందోళన రేపుతోంది.సీలేరు నది నుంచి నీరు విడుదల చేయడంతో శబరి నది ఉధృతంగా మారుతున్నది.గోదావరి నదిలో వరద ఉధృతి భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 11:30 గంటలకు 43 అడుగులుగా నమోదైంది.ఎగువ ప్రాంతాలు దుమ్ముగూడెం, వెంకటాపురం, పేరూరు, ఏటూరునాగారం, పాతగూడెం, కాళేశ్వరం వద్ద కూడా నీటి మట్టాలు పెరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement