హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. షాపింగ్ మాల్‌లో నిరసనకారుల ప్రదర్శన విధ్వంసకాండకు దారితీసింది. కత్తితో ఓ వ్యక్తి విరుచుకుపడటంతో పలువురు గాయపడ్డారు. ఘర్షణల్లో రాజకీయ నేత చెవికి తీవ్ర గాయమైంది. టైకూషింగ్ నగరంలోని సిటీప్లాజా ఆందోళనకారులు పోలీసులు బాహాబాహీకి దిగడంతో రక్తసిక్తమైంది. ఘర్షణలతో మాల్‌లోని ఎస్కలేటర్లపై నిరసనకారులు, మహిళలు, చిన్నారులు పరుగులు పెట్టారు.