ఏయే ఆస్తులు కొంటారో స్పష్టంగా చెప్పండి

అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల కొనుగోలు విషయంలో గరిష్టంగా ఎంత మొత్తం చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎంత కాలంలోగా ఆ సొమ్ము చెల్లిస్తారు? ఏయే ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వెల్లడించాలని ఆదేశించింది. ఈ వివరాలను పరిశీలించిన తరువాత తదుపరి విచారణలో ఈ మొత్తం వ్యవహారంలో మీ భవితవ్యం ఏమిటో తేల్చేస్తామని సుభాష్‌ చంద్ర ఫౌండేష న్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. ఇది తామిచ్చే చివరి అవకాశమని పేర్కొంది. తదుపరి విచా రణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top