ఏటీఎమ్‌‌లో గన్‌తో బెదిరించి దోపిడీ | Gun Point at Son Couple looted in Indore ATM | Sakshi
Sakshi News home page

ఏటీఎమ్‌ లో గన్‌తో బెదిరించి దోపిడీ

Feb 1 2018 9:42 AM | Updated on Mar 20 2024 5:16 PM

చిన్నారి ఛాతీపై తుపాకీ ఎక్కుపెట్టి ఓ వ్యక్తి దోపిడీకి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఏటీఎమ్‌ సెంటర్‌లోకి ముసుగుతో ప్రవేశించిన ఓ వ్యక్తి.. డబ్బులు డ్రా చేస్తున్న జంటను బెదిరించి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. 

ఇండోర్‌ లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎమ్‌ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఓ జంట తమ పిల్లాడితో డబ్బులు డ్రా చేయటానికి లోపలికి వెళ్లింది. ఇంతలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి లోపలికి దూసుకొచ్చాడు. అతన్ని నిలువరించే యత్నం చేయగా.. గన్‌ గురిపెట్టాడు. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేయగా.. సదరు వ్యక్తి ఎదురు తిరిగే యత్నం చేశాడు. వెంటనే దొంగ తుపాకీని అతని కొడుకువైపు మళ్లించాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement