సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఈ ఖరీఫ్ సీజన్‌కు పలు ప్రధాన పంటల కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)లను పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. వరికి ఈ ఎమ్మెస్పీకి రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ. 200 పెంచింది. సాధారణ రకం వరి ఎమ్మెస్పీని క్వింటాల్‌కు రూ. 1550 నుంచి రూ. 1750కి, గ్రేడ్–ఏ రకం వరికి క్వింటాల్‌కు రూ. 1590 నుంచి రూ. 1770కి పెంచారు. పత్తి ఎమ్మెస్పీని రూ. 4020 నుంచి రూ. 1130 పెంచి, 5,150 రూపాయలకు చేర్చారు.