ఉన్నతాధికారుల మధ్య అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కాస్త ఛీబీఐగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య వివాదం నెలకొనడంతో కేంద్రం స్పందించింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తప్పిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.