ప్రతిపక్ష నేత చంద్రబాబు సభకు క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఇవాళ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సభకు నాయకత్వం వహించి సభను చక్కగా నడిపిస్తున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. సభలో జరిగిన పరిణామాలను యావత్ ప్రజలు గమనిస్తున్నారు. చట్టసభలో ఏం నేర్చుకుంటున్నాం.