ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు. అక్కడ కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా?. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం కట్టారు. ఆయన అధికారంలో ఉండగానే ఆల్మట్టీ డ్యామ్ ఎత్తు పెంచడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంతో స్నేహభావంతో మెలగడం తప్పా?. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి. సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు చక్రం తిప్పుతున్న రోజుల్లోనే ఆల్మట్టీ డ్యామ్ ఎత్తు పెంచారు. గత పదేళ్లలో కృష్ణా జలాల లభ్యత దారుణంగా పడిపోయింది.’ అని అన్నారు.