శ్రీ విళంబినామ సంవత్సరంలో యావన్మంది తెలుగు ప్రజలు, అన్య సంస్కృతులు, భాషల ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో శనివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.