ప్రతి విషయంలోనూ పక్కవాళ్ల క్రెడిట్‌ను చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకువడంలో సిద్ధహస్తుడనే విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరిగి అధికారం దక్కించుకోవడానికి ఆయన దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ’నవరత్నాలు‘ను చంద్రబాబు నాయుడు వరుసపెట్టి కాపీ కొడుతున్నారు. కాపీ కొట్టడమే కాకుండా అదంతా తమ ఘనతే అని ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. గురువారం నుంచి ఏడు జిల్లాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్, ఈ నెలాఖరున సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో చంద్రబాబు సర్కార్... చివరి కెబినెట్ సమావేశంలోఎన్నికల తాయిలాలను విచ్చలవిడిగా ప్రకటించేసింది.