సీబీఐతో ఇద్దరు టీడీపీ ఎంపీలకు దోస్తీ | CBI calls special director Asthana 'pest'; HC takes strong exception to remark | Sakshi
Sakshi News home page

సీబీఐతో ఇద్దరు టీడీపీ ఎంపీలకు దోస్తీ

Oct 24 2018 6:57 AM | Updated on Mar 20 2024 3:51 PM

 కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని అవసర మైన సందర్భాల్లో ఉప యోగించుకునేందుకు తెలుగుదేశం పార్టీ భారీ వ్యూహరచన చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. టీడీపీ ముఖ్యంగా రెండు ప్రయోజనాలను ఆశించే.. సీబీఐ ఉన్నతాధికారులతో సన్ని హిత సంబంధాలకు ప్రయత్నించి నట్లు తెలుస్తోంది. ఒకటి రాజకీయ ప్రత్యర్థులకు ఇబ్బందులు సృష్టించడం కాగా.. రెండోది తమపై విచారణకు ఆదేశిస్తే బయటపడే మార్గాలు అన్వేషించడం.

ఇప్పటికిప్పుడే తెర వెనుక జరిగిన పరిణామాలు బయటకు వచ్చే అవకాశాల్లే నప్పటికీ..కాలక్రమేణా సీబీఐ కేసుల్లో కీలకంగా వ్యవహ రించిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు, మరో రాజ్యసభ సభ్యుని వ్యవ హారం బయటకు వస్తుం దని సీబీఐ వర్గాలే అంటు న్నాయి. సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ అస్థానాపై అవినీతి కేసు నమోదు కావడం, డీఎస్పీ స్థాయి అధికారి ఒకరిని అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. ఈ సంస్థ అధికారు లతో టీడీపీ నేతల సంబంధాలపై ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement