సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం | BJP's Yeddyurappa Takes Oath As Karnataka Chief Minister | Sakshi
Sakshi News home page

సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం

May 17 2018 9:37 AM | Updated on Mar 22 2024 10:55 AM

కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీఎస్‌ యడ్యూరప్ప గురువారం ప్రమాణం స్వీకరించారు. రాజ్‌భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో యడ్యూరప్పతో గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ప్రమాణం చేయించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పగ్గాలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రకాశ్‌ జవదేకర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. యెడ్డీ ప్రమాణం అనంతరం బీజేపీ కార్యకర్తలు శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై.. మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement