మొన్న ఐస్ బకెట్, నిన్న కిక్ చాలెంజ్... నేడు బాటిల్ క్యాప్ చాలెంజ్. సామాజిక మాధ్యమాల్లో కొత్త చాలెంజ్ రావడానికి ఎంత సమయం పడుతుందో కానీ అది ట్రెండ్ అవడానికి అరక్షణం చాలు..! ఇంటర్నెట్‌లో ప్రస్తుతం బాటిల్ క్యాప్ చాలెంజ్ క్రేజ్ నడుస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ దీని వెంటపడుతున్నారు. ఇది హాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఎందరో నటులు ఈ చాలెంజ్‌కు సై అంటూ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ప్రస్తుతం గల్లీబాయ్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సిద్ధాంత్ చతుర్వేది ఈ సవాలును స్వీకరించి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన మొదటి బాలీవుడ్ నటుడిగా నిలిచారు.