సుజనాకు షాక్‌ : ఆస్తులను వేలం

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఆయన పవర్‌ ఆఫ్‌ అటార్నీగా ఉన్న పలు ఆస్తులను వేలం వేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మార్చి 23, 2020న ఈ వేలం పాట జరగనుంది. మార్చి 20న సుజనా ఆస్తులను తనిఖీ చేసుకోవచ్చన్న బ్యాంకు.. మొత్తం రూ.400 కోట్ల 84లక్షల 35వేల బకాయి ఉన్నట్టు తెలిపింది. తీసుకున్న రుణ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఆ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయనున్నట్లు బ్యాంక్ నోటీసుల్లో తెలిపింది. రుణం జమానతు ఇచ్చిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు బ్యాంక్ చెబుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top