ఇరవై ఐదు రోజులుగా ఎదురుచూస్తున్నా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఫోన్ రాకపోవడంతోనే తాను బీజేపీలో చేరినట్లు ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ అన్నారు. శనివారం పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినందు వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని బాబుమోహన్ వ్యాఖ్యానించారు.