అమరావతిలో జ్యోతి హత్యోదంతం మరువకముందే ఏపీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఒంటిపై తీవ్ర గాయాలతో యువతి అక్కడిక్కడే మృతిచెందగా, యువకుడు రక్తపు మడుగులో కొనఊపిరితో పడిఉన్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.