జిల్లాలోని చండూర్ మండలం ఘట్టుప్పల్‌లో ఏటీఎంలోని నగదు చోరికి పాల్పడి పోలీసులకు చిక్కాడు ఓ యువకుడు. గడ్డపారతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేస్తుండగా గ్రామస్తులు చూసి పోలీసులకు పట్టించారు. పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వాయులపల్లి గ్రామానికి చెందిన జలందర్ ఘట్టుప్పల్‌లోని ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బులు దొంగతనం చేయాలని పథకం పన్నాడు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గడ్డపార, సుత్తె, కొడవలితో ఏటీఎం మిషన్ వద్దకు వచ్చాడు.