ఏపీలో ఆర్థిక, సైబర్‌ నేరాలు పెరిగాయి: డీజీపీ

తేడాదితో పోలిస్తే 2018లో రాష్ట్రంలో నేరాలు 3.5 శాతం తగ్గాయని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తెలిపారు. 2017లో ఏపీలో మొత్తం 1.23 లక్షల కేసులు నమోదు కాగా... ఈ ఏడాది 1.11 లక్షల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 2018లో రైల్వే నేరాలను గణనీయంగా తగ్గించామన్నారు. రోడ్డు ప్రమాదాలు 9.09 శాతం తగ్గాయని తెలిపారు. హత్యలు, కిడ్నాప్‌ వంటి నేరాలను నియంత్రినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది ఆర్థిక నేరాలు 29.22 శాతం పెరగగా...సైబర్‌ నేరాలు కూడా 25.67 శాతం పెరిగినట్లు వెల్లడించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top