కొత్త పెన్షన్లను ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఫిబ్రవరి 15 కల్లా ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశారు. తాను గ్రామాలకు వెళ్లినప్పుడు అర్హుల జాబితాను తనిఖీ చేస్తానని.. అర్హులైన వారికి స్థలం కేటాయించలేదనే విషయాన్ని గుర్తిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.