టీడీపీ హయాంలో అక్రమంగా విల్లాలు కట్టారు | Alla Rama Krishna Reddy Fires On Lingamaneni Over Constructions | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలో అక్రమంగా విల్లాలు కట్టారు

Jul 6 2019 2:13 PM | Updated on Mar 20 2024 5:15 PM

కరకట్టలో తనకు ఇల్లు ఇచ్చినందుకే అక్రమాలకు పాల్పడిన లింగమనేని రమేష్‌ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడుకుంటూ వస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కేవలం తన నియోజకవర్గంలోనే లింగమనేని 40 నుంచి 50 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో జరిగిన భూబాగోతాలపై దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరనున్నట్లు తెలిపారు. శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆర్కే విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement