అరటిపండు తొక్కపై కాలేస్తే జారిపడతాం. ఇది అందరికీ తెలుసు. కానీ ఎవరు స్వయంగా దీనిని టెస్టు చేసి మరీ తెలసుకొని ఉండరు. ఎవరు మాత్రం తెలిసి.. తెలిసి.. అరటితొక్కపై కాలేస్తారు. కానీ, ఓ మహిళ మాత్రం ఏకంగా అరటిపండుపై కాలేసింది. అమాంతం జారిపడింది. ఆ వీడియోను తీసి ట్విటర్‌లో పోస్టు చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.