కుటుంబ కథా చిత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, బంధాలు అనుబంధాల కాన్సెప్ట్‌తో సినిమా అంటే ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. దీనికి ఉదాహరణే గతేడాది వచ్చిన శతమానం భవతి. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సాధించింది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న అమ్మమ్మ గారిల్లు కూడా కుటుంబం, ఎమోషన్స్ లాంటి ఫార్మాట్‌లోనే ఉండబోతోంది