సంక్లిష్టమైన జీఎస్‌టీ రేట్లను పాటించడంలోనూ, అమలు చేయడంలోనూ వ్యయాల భారం భారీగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) రేట్లను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని.. రెండు రేట్ల విధానంతో అధిక ప్రయోజనాలుంటాయని పేర్కొంది.